టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గాయపడినట్లు సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చిన వార్త ఇప్పుడు అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తన చేతికి కట్టు ఉన్న ఫోటోలను నాని స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అయితే, ఈ గాయం ఎలా అయింది, దీని తీవ్రత ఎంత అనే విషయాలపై ఆయన నేరుగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ, ఆ పోస్టులో కెమెరా ఎమోజీని జోడించడంతో..చిత్రీకరణ సమయంలోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని టాలీవుడ్ వర్గాలు గట్టిగా భావిస్తున్నాయి.