కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ కార్యక్రమం పాలనకు కొత్త నిర్వచనం ఇచ్చిందని, ప్రజలను సాధికారులను చేయడంతో పాటు జీవితంలోని ప్రతి రంగాన్ని సృశిస్తూ సమగ్ర అభివృద్ధికి దోహదపడిందని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా ప్రారంభమై 11 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు కొత్త గుర్తింపు తీసుకొచ్చిందని ఆయన అన్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ వరకు సాంకేతికత ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచే శక్తివంతమైన సాధనంగా మారిందని ప్రధాని తెలిపారు.