ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “కుటుంబాలు, చిన్నారులతో కలిసి ప్రజలు ప్రశాంతంగా గడిపే బీచ్లను కూడా చంద్రబాబు ప్రభుత్వం వదలడం లేదు. అక్కడ బీచ్ షాక్స్ (Beach Shacks) పేరుతో కొత్త మద్యం సంస్కృతికి తెరలేపుతోంది” అంటూ ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్ర సామాజిక వాతావరణాన్ని పూర్తిగా చెడగొట్టేలా ఉన్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.