నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో నిర్వహించిన ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడారు.గతంలో మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడినవాళ్లు.. ఇప్పుడు మావిగన్ అంటూ వస్తున్నారని.. మావిగన్ అంటే తనకే అర్థం కావడం లేదంటూ చంద్రబాబు సెటైర్లు వేశారు.తాను బటన్ నొక్కే వ్యక్తిని కాదన్న చంద్రబాబు.. ప్రజలలో ఉండే వ్యక్తిని అని స్పష్టం చేశారు. అందుకే ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు.