పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులను దాటి, ఆ దేశ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద సంస్థ ఐసిస్-కే స్థావరాలపై తాలిబన్ ప్రభుత్వ ఆర్మీ భారీ వైమానిక దాడులు నిర్వహించింది. తమదేశ పౌరులపై దాడులకు వ్యూహాలు రచిస్తున్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు.ఖైబర్ పఖ్తున్ ఖ్వా ప్రావిన్స్ లపై ఈ ఆకస్మిక సైనిక చర్య చేపట్టింది ఆఫ్ఘనిస్తాన్. అత్యాధునిక డ్రోన్ విమానాలు నేరుగా ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్న రహస్య స్థావరాలపై బాంబుల వర్షం కురిపించినట్లు తాలిబన్ అధికారిక వార్తా సంస్థ టోలో న్యూస్ తెలిపింది.