రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై లారీని బస్సు ఢీకొట్టి, ఆ తర్వాత మంటలు చెలరేగాయి. ఈ ప్రమదంలో కనీసం ఎనిమిది మరణించగా, మరో 22 మంది వరకు గాయపడ్డారు. హన్స్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్తుండగా బుధవారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహనాల్లోనూ భారీగా మంటలు చెలరేగాయి.