విశాఖపట్నంలో మంగళవారం ఘనంగా జరిగిన కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం (CTUAP) ప్రథమ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రసంగం చేశారు. కేవలం పట్టాలు అందుకోవడం మాత్రమే విద్యకు అంతిమ లక్ష్యం కాదని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపినప్పుడే చదువుకు సార్థకత చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు. సమాజంలోని ప్రతి పౌరుడికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందినప్పుడే ప్రధానమంత్రి మోదీ ఆకాంక్షించిన ‘వికసిత్ భారత్’ కల సాకారమవుతుందని లోకేశ్ పేర్కొన్నారు.