రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా వర్షాలు తక్కువ పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారని వివరించారు. అందుకే రైతులు ఈసారికి వర్షాధార పంటలు ఎక్కువ వేయొద్దని సూచించారు. పంటమార్పిడి గురించి ఆలోచించాలని హితవుపలికారు. నిపుణుల సూచనల మేరకు పంటలు వేయాలని అందుకు తగ్గట్టు విత్తనాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.