దేశాన్ని ‘వికసిత భారత్’గా మార్చే అద్భుతమైన ప్రయాణంలో భారత యువతదే అత్యంత కీలకమైన పాత్ర అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు.యువత అభివృద్ధి చెందడానికి విద్య, సాధికారతలే అత్యంత శక్తివంతమైన ఆయుధాలని ఆమె పేర్కొన్నారు. మన దేశ గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, చారిత్రక వారసత్వాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. మంగళవారం నాడు విశాఖపట్నంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (CTUAP) మొదటి స్నాతకోత్సవ వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
<span;>