తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధి సమీక్షలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యాదగిరి గుట్ట లో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కోసం మార్కెట్ రేట్ ప్రకారం భూమి కేటాయించాలని, వివిధ మఠాలకు భూముల కేటాయింపు పైన ఒక విధానం రూపొందించాలని తెలిపారు. కుల సంఘాలకు స్థలం కేటాయింపు పైన స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానం తయారు చేయాలని.. భూమి యాజమాన్యపు హక్కులు టెంపుల్ వద్దనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.