పరీక్షల నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండుతో కాక్రోచ్ జనతా పారీ (సీజేపీ) దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేస్తున్న నిరసనలో భాగంగా పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్బుక్ ఆదివారం నిరాహార దీక్ష ప్రారంభించారు. దీక్షకు ముందు ఆయన, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే రాజ్ ఘాట్ వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. వందల మంది ఉద్యమకారులు, యువత, విద్యార్థులు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు.