సౌదీ అరేబియాలో ప్రముఖ ప్రభుత్వ రంగ చమురు దిగ్గజ సంస్థ Saudi Aramco కు చెందిన ఒక హెలికాప్టర్ అకస్మాత్తుగా అదుపుతప్పి కిందకు పడిపోవడంతో ప్రమాదానికి గురైంది.ఈ దుర్ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారంతా సౌదీ అరేబియా జాతీయులేనని ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ‘సౌదీ ప్రెస్ ఏజెన్సీ’ (SPA) వెల్లడించింది. రస్ తనూరా (Ras Tanura) పరిధిలో ఆదివారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.