కవిటి మండలం జమెదారి పుట్టుగ వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. కంచిలి ఆదివారం సంత నుండి పనసాకాయల లోడుతో వస్తున్న లగేజీ వ్యాన్ లో ముగ్గురు మహిళలు తో పాటు కొంత మంది ప్రయాణిస్తున్నారు. అతివేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో వ్యాన్ బోల్తా పడింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. వీరిని 108 వాహనం లో ఇచ్చాపురం ఆసుపత్రికి తరలించారు.