పేపర్ లీకేజీ ఘటనల్లో బీజేపీ నిర్లక్ష్యంపై కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘మరో పేపర్ లీకేజీ. మరో పరీక్ష రద్దు. ఈసారి మహారాష్ట్ర టెట్. దేశంలోని విద్యావ్యవస్థ, పరీక్షా నిర్వహణ వ్యవస్థ ఒక దోపిడీ వ్యవస్థగా మారింది. దేశంలోని ప్రతి యువకుడు అభద్రతతో ఉన్నాడు. ఇది పేపర్ లీకేజీ కాదు. యువత భవిష్యత్తును కొల్లగొట్టడం’’ అంటూ రాహుల్ గాంధీ స్పందించారు.