ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో శుక్రవారం అర్ధరాత్రి భారీగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు పిడుగులు పడడంతో అంకంపల్లి గ్రామంలో 21 ఆవులు మృతి చెందాయి. దీంతో బాధిత రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.