పాకిస్థాన్ లో శనివారం (జూన్ 27) ఒక మోస్తరు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదైనట్లు యూరోపియన్-మెడిటేరియన్ సీస్మలాజికల్ సెంటర్ (EMSC) అధికారికంగా వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి ప్రాణాలు చేతిలో పట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ భూకంప కేంద్రం భూమి అంతర్భాగంలో 35 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు గుర్తించారు