బాలానగర్ మండలం హస్మత్ పేటలో శనివారం హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. దాదాపు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. మార్కెట్లో దీని విలువ 750 కోట్ల రూపాయలవరకు ఉంటుందని అంచనా వేశారు. హస్మత్ పేట సర్వే నంబర్ 01 లో మొత్తం 108 ఎకరాలుండగా ఇప్పటికే 98 ఎకరాలు కబ్జాకు గురయింది. అక్కడ ఇళ్ళ నిర్మాణాలు జరిగిపోయాయి. ఇప్పటికే నివాసాలు ఉంటున్న ఇళ్ల జోలికి వెళ్లకుండా హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. ప్రీకాస్ట్ వాల్స్ తో పాటు తాత్కాలికంగా వేసిన షెడ్డులను హైడ్రా తొలగిస్తుంది