సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ తమిళ నటుడు, స్టార్ డైరెక్టర్ కె.భాగ్యరాజ్ (73) శనివారం
ఉదయం చెన్నైలో కన్నుమూశారు.ఇంట్లో ఉన్న సమయంలో శనివారం ఉదయం అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు వైద్యులు తెలియజేశారు.భాగ్యరాజ్ మృతి చెందడంతో కోలివుడ్తోపాటు యావత్ భారతీయ సినీ పరిశ్రమ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.