డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు చెందిన స్థలం కబ్జా యత్నం జరిగింది. రఘురామకృష్ణంరాజు విశాఖ మధురవాడ పరిధిలో 333.33 గజాల స్థలం వుంది ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం దీని ధర రూ.2 కోట్లకు పైగా ఉంటుంది. రఘురామకృష్ణంరాజు సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను సృష్టించారు. ఆ ఫోర్జరీ డాక్యుమెంట్లతో సదరు స్థలాన్ని పలుమార్లు ఒకరి నుంచి ఒకరికి యాజమాన్య బదిలీ (రిజిస్ట్రేషన్) కూడా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆయన స్థలంలో నిర్మాణాలు ప్రారంభించే క్రమంలో ఈ కబ్జా పర్వం వెలుగులోకి వచ్చింది.