ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ-జనసేన కూటమి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక పూర్తిగా గాలికొదిలేశారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. డ్వాక్రా మహిళల వడ్డీ లేని రుణ పరిమితిని రూ. 3 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచుతామని చెప్పి, నేడు ఉన్న పథకాన్ని కూడా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఇవ్వాల్సిన దాదాపు రూ. 6,000 కోట్ల నిధులను నొక్కేసిందని జగన్ విమర్శించారు. 2025-26 బడ్జెట్‌లో రూ. 100 కోట్లు కేటాయించినా విడుదల చేసింది మళ్లీ సున్నా అని ఎండగట్టారు.