పాస్ పోర్టు కూడా పౌరసత్వం రుజువుగా చెల్లదంటూ కేంద్రం చేసిన ట్వీట్ పై అసదుద్దీన్ ఓవైసీ సెటైర్లు వేశారు. ప్రభుత్వం ప్రకారం, ఏ పత్రమూ పౌరసత్వానికి తిరుగులేని రుజువు కాదని ఓవైసీ తెలిపారు. అలాగే 2030 నాటికి, పౌరసత్వానికి ఒకే ఒక్క పత్రం రుజువుగా ఉంటుంది అంటూ బీజేపీ సభ్యత్వ గుర్తింపు కార్డు ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. దీన్ని బట్టి బీజేపీ గుర్తింపు
కార్డు తప్ప ఇతర ఏ కార్డు కూడా పౌరసత్వానికి రుజువుగా పనికి రాదని ఓవైసీ తేల్చిచెప్పేశారు.