ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నుంచి పేరు తొలగించబడిన వారికి రేషన్ నిరాకరిస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఎస్ఐఆర్‌లో పేరు తీసేస్తే రేషన్ ఇవ్వరా అంటూ సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ఇది రాష్ట్ర పరిధిలోని ప్రత్యేక కారణాలతో కూడిన అంశం కాబట్టి.. ఆర్టికల్ 32 కింద నేరుగా సుప్రీంకోర్టుకు రాకుండా ముందుగా కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.