జబర్దస్త్ ఫైమా తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తన ప్రియుడు ప్రవీణ్ నాయక్ తో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. సాధారణంగా సెలబ్రిటీల పెళ్లిళ్లంటే హంగులు, ఆర్భాటాలు ఉంటాయి. కానీ ఫైమా మాత్రం చాలా సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఈ విషయాన్ని ఆమెనే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. రిజిష్టర్ ఆఫీస్ లో ప్రవీణ్ నాయక్ తో కలిసి పూల దండలు మార్చుకుంటోన్న వీడియోను ఫైమా షేర్ చేసింది.