రాయలసీమ ప్రాంతం రానున్న రోజుల్లో రతనాల సీమగా మారనుందని, స్వర్ణాంధ్ర ప్రదేశ్ అనే కల సాకారం కానుందని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలులోని జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రారంభం సందర్భంగా సీఎం మాట్లాడారు. చమురు తర్వాత దేశంలో ఎక్కువగా దిగుమతి చేసుకునేది బంగారమేనని సీఎం అన్నారు. ఆ బంగారం ఇప్పుడు మన దగ్గర ఉత్పత్తి కాబోతోందని చెప్పారు. రాయలసీమ చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలైందని సీఎం చెప్పారు. జొన్నగిరికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని సీఎం గుర్తు చేశారు. జొన్నగిరి వజ్రాలు, బంగారానికి నిలయమన్నారు.