భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ కీర్తికిరీటంలో మరో అత్యున్నత పురస్కారం చేరింది. దేశంలోనే నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ అవార్డును ఆయన అందుకున్నారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగిన పౌర పురస్కారాల ప్రధానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా రోహిత్ శర్మ ఈ అవార్డును స్వీకరించారు. తన అద్భుతమైన కెప్టెన్సీతో భారత జట్టుకు చారిత్రాత్మక విజయాలు అందించినందుకు గానూ కేంద్ర ప్రభుత్వం ఆయనను ఈ పురస్కారంతో గౌరవించింది