సంచలనం రేపిన సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.అయితే సీఐ నాగరాజును అరెస్ట్ చేయవద్దంటూ ఆయన మద్దతుదారులు ఉదయం నుంచి ఇంటి వద్ద ఆందోళకు దిగారు. అయితే పోలీసు సాయంతో సిట్ అధికారులు సీఐ నాగరాజును నివాసంలోకి అతికష్టం మీద వెళ్లారు. కేసు విషయమై కొన్ని గంటలపాటు ప్రశ్నించిన అనంతరం సిట్ అధికారులు సీఐ నాగరాజును అదుపులోకి తీసుకుని పోలీస్ గెస్ట్ హౌస్‌కు తరలిస్తున్నారు.