టెలిగ్రామ్ యాప్ మళ్లీ ప్రారంభమైంది. ఆ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌లో మళ్లీ రిస్టోర్ చేశారు. నీట్ యూజీ రీఎగ్జామ్ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.ఇవాళ ఉదయం నుంచి కొందరు యూజర్లకు టెలిగ్రామ్ యాప్ అందుబాటులోకి వచ్చేసింది. గూగుల్ రిస్టోర్ చేయకముందే కొందరు దాన్ని వాడడం ప్రారంభించారు. కానీ యాపిల్ ఆప్ స్టోర్‌లో మాత్రం ఇంకా డీలిస్టు కేటగిరీలోనే ఆ యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. యాపిల్ సంస్థ దీనిపై స్పందించేందుకు నిరాకరించింది.