ప్రతి ఏటా విజయ్ పుట్టినరోజున అందరికంటే ముందుగా స్పెషల్ పోస్ట్ పెట్టే స్టార్ బ్యూటీ త్రిష.. సారి కనీసం సోషల్ మీడియా వేదికగా ఒక్క విష్ కూడా చేయకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. నిన్న విజయ్ బర్త్ డే రోజు త్రిష పూర్తిగా సైలెంట్‌గా ఉండటమే కాకుండా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో విజయ్‌ను అన్‌ఫాలో చేసి షాక్ ఇచ్చింది. ఎంతో కాలంగా కొనసాగుతున్న వీరి రిలేషన్‌షిప్‌కు త్రిష ఈ విధంగా ఫుల్‌స్టాప్ పెట్టడంతో.. వీళ్లిద్దరూ విడిపోయారనే వార్తలకు గట్టి బలం చేకూరింది.