ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-II విస్తరణ పనులు, దానికి అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం పొందే అంశాలపై ప్రధానంగా చర్చలు జరిగాయి. సీఎం చర్చలు సఫలమైతే మెట్రో ఫేజ్-II అడ్డంకులు తొలగనున్నాయి.