విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన రౌడీషీటర్ సాయికృష్ణ అదృశ్యం కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన దాదాపు ఏడాదికి పైగా రికార్డులు, కీలకమైన సీసీటీవీ ఫుటేజీలు మాయమైనట్లు సమాచారం. సిట్ అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన సీసీటీవీ హార్డ్‌డిస్క్, డీవీఆర్ (DVR), ఎన్‌వీఆర్ (NVR)లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అయితే కేవలం రెండు రోజుల ఫుటేజీ మాత్రమే లభ్యం కావడంతో,అది రికవరీ చేయడానికి సిట్ టీమ్ హార్డ్ డిస్క్‌లను ల్యాబ్‌కు పంపింది.