ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి లీ సియోంగ్-హోను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భారత్లో లో కొరియా కంపెనీలకు పెరుగుతున్న ప్రాధాన్యం, భవిష్యత్ భాగస్వామ్య అవకాశాలపై చర్చలు జరిపారు. ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్లు, మైక్రో ఎలక్ట్రానిక్స్, స్టోరేజ్, షిప్ బిల్డింగ్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాలలో కొరియా అగ్రగామిగా నిలుస్తోందని లోకేశ్ తెలిపారు. కొరియా సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.