గత 7 ఏళ్లుగా వాట్సాప్ అధినేతగా విజయవంతంగా సేవలందిస్తున్న విల్ క్యాత్‌కార్ట్ ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు మాతృ సంస్థ మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అధికారికంగా ప్రకటించారు. విల్ క్యాత్‌కార్ట్ స్థానంలో భారతీయ టెక్ దిగ్గజం, ప్రముఖ ఫిన్‌టెక్ స్టార్టప్ క్రెడ్ వస్థాపకుడు కునాల్ షా వాట్సాప్ తదుపరి గ్లోబల్ హెడ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ కీలక పరిణామాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, విల్ క్యాత్‌కార్ట్ అందించిన సేవలను కొనియాడారు.