అల్లూరి సీతారామరాజు జిల్లాలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతం మీదుగా అక్రమంగా రవాణా అవుతున్న భారీ గంజాయి డంప్‌ను పట్టుకున్నారు. పక్కా సమాచారంతో మెరుపుదాడి చేశారు. పాడేరు ఏజెన్సీ పరిధిలోని ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు సమీపంలో ఈ భారీ పట్టివేత జరిగింది. 1,125 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ సరకు విలువ మార్కెట్లో సుమారు రూ. 5 కోట్ల 62 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు.