దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ (NEET) రీటెస్ట్ అత్యంత కఠినమైన భద్రతా ప్రమాణాల మధ్య ప్రశాంతంగా ముగిసింది. అయితే, గతంతో పోలిస్తే ఈసారి క్వశ్చన్ పేపర్ చాలా టఫ్‌గా (కఠినంగా) వచ్చిందని పలువురు అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఫిజిక్స్ (భౌతికశాస్త్రం) ప్రశ్నలు చాలా లెంగ్తీగా, సమయం తీసుకునే విధంగా వచ్చాయని తెలిపారు. కెమిస్ట్రీ (రసాయనశాస్త్రం) పేపర్ కూడా కొంత హార్డ్‌గా అనిపించినప్పటికీ, బయోలజీ (జీవశాస్త్రం) ప్రశ్నలు మాత్రం సులభంగా, బాగున్నాయని విద్యార్థులు పేర్కొన్నారు.