పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురి వద్ద ఆదివారం తెల్లవారుజామున అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఉత్తర బెంగాల్ ఆర్టీసీ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని అత్యంత వేగంగా వెనుక నుండి ఢీకొట్టడంతో లారీ చక్రాల కిందకు బస్సు బాడీ దూసుకుపోవడంతో ప్రయాణికులు లోపలే ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు, మొత్తం 23 మంది తీవ్రంగా గాయపడ్డారు, గాయపడిన వారిలో 17 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.