ఖమ్మం నగరంలో ఇద్దరు చిన్నారులకు ఎలుకల మందు తాగించి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.ఏదిలాపురం మున్సిపాలిటీ గుర్రాలపాడుకు చెందిన లింగరాజు,స్వాతి భార్యాభర్తల మధ్య వివాదం నేపథ్యంలో శనివారం సాయంత్రం ఇద్దరు కుమారులకు ఎలుకల మందు తినిపించి, తాను కూడా తాగింది. స్థానికులు గమనించి ముగ్గుర్నీ ఆసుపత్రికి తరలించగా.. ఇద్దరు కుమారులు వేదిక్ (7), తనుష్ (5) మృతి చెందారు. తల్లి స్వాతి చికిత్స పొందుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.