హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిధులు, విస్తరణ మంజూరు అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైన పొలిటికల్ వార్ కు దారితీసింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జూన్ 20, 2026 నాటి అధికారిక లేఖలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి సవాల్ విసురుతూనే ఉమ్మడి పరిష్కారం కోసం ప్రతిపాదనలు పంపారు. జూన్ 22,23 తేదీల్లో తాను దిల్లీ పర్యటనలో ఉంటానని, ఈ లోపే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.