రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చి.. నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. వైకాపా హయాంలో అన్నదాతలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని తెలిపారు. అన్నదాతలకు ప్రతి విషయంలో అండగా ఉన్నాం. బటన్ నొక్కగానే 99.8 శాతం మంది రైతులకు నిధులు జమయ్యాయి. గతంలో ధాన్యం కొని ఆరు నెలలైనా డబ్బులు వచ్చేవి కావు. మా ప్రభుత్వం 48 గంటల్లోనే డబ్బులు ఇస్తోంది. ప్రజలను కష్టాల్లోకి నెట్టడం తప్ప గొడ్డలి పార్టీకి మరేమీ తెలియదని విమర్శించారు. రైతు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందన్నారు.