ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వగ్రామం ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో ఉన్న పహడ్పుర్ గ్రామంలో పర్యటించారు. గిరిజన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికంగా ఉన్న ఆచారాలు, సంప్రదాయాల గురించి రాష్ట్రపతి స్వయంగా ప్రధానికి వివరించగా ఆసక్తిగా విన్నారు. ఇలాంటి విభిన్న సంస్కృతులే దేశానికి గొప్ప ఆభరణాలని ప్రధాని ప్రశంసించారు. భవిష్యత్తు తరాలు ఈ సంప్రదాయాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం, నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.రాష్ట్రపతి ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన పాఠశాలను ప్రారంభించారు.