మెగా అభిమానులకు ఊహించని సర్ప్రైజ్. రామ్చరణ్, ఉపాసనల ముద్దుల బిడ్డ క్లీంకారను ఎపుడెపుడు చూస్తామా? అని ఎదురు చూసిన వారి కల నెరవేరింది. మూడో పుట్టినరోజు సందర్భంగా క్లీంకారకు శుభాకాంక్షలు చెబుతూ చిన్నారి ఫొటోను ఉపాసన సోషల్మీడియా వేదికగా పంచుకున్నారు. అటు ఉపాసన, అటు రామ్చరణ్ క్లీంకారను ఇరు వైపులా ఎత్తుకుని నిలబడగా, చిరునవ్వులు చిందిస్తూ చిన్నారి కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతోంది.