ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధిని మరోసారి మూసివేసింది. అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇరాన్ మళ్లీ హార్ముజ్‌ను మూసేసింది. దీనికి కారణం ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు జరపడమే ఇందుకు కారణం. శనివారం కూడా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడిచేసింది. అమెరికాతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించి, ఇజ్రాయెల్ దాడులు చేసినందుకే హార్ముజ్‌ను మూసేస్తున్నామని ఇరాన్ ప్రకటించింది.