తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు న్యాయస్థానంలో పెద్ద ఊరట లభించింది. గత రెండు వారాలుగా రిమాండ్‌లో ఉంటూ జైలు జీవితం గడుపుతున్న ఆయనకు తాజాగా మల్కాజిగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భగీరథ్ తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ తుది ఉత్తర్వులు జారీ చేశారు.