<span;>బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు, పిడుగులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి.అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు. వీటితో పాటు దక్షిణ కోస్తా పరిధిలోని గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిపల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షపు జల్లులు పడతాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు కురిసే వీలుంది.