ప్రపంచ శరణార్థుల దినోత్సవం ప్రతి ఏట జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ప్రపంచంలోని శరణార్థుల గురించి అవగాహన కలిపించడంకోసం ఈ దినోత్సవంను జరుపుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శరణార్థుల అంశం ప్రధాన సమస్యగా మారడంతో శరణార్థుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి 1950, డిసెంబర్ 14న ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థని ఏర్పాటు చేసింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2000, డిసెంబరు 4న సమావేశమై ప్రతి సంవత్సరం జూన్ 20న “అంతర్జాతీయ శరణార్ధుల దినోత్సవం” జరపాలన్న తీర్మానాన్ని ఆమోదించింది.