ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఎవ్వరూ కలలోనూ ఊహించి ఉండరని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించామన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు.. విద్యకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారు. విద్యాశాఖకు మంత్రి లేడంటూ కొందరు మాట్లాడుతున్నారు. పదేళ్లు వాళ్లు చేసిన విధ్వంసంతో వందేళ్ల నష్టం జరిగింది’ అని రేవంత్ అన్నారు.