పశ్చిమాఫ్రికా దేశం నైజర్‌లో తెల్లవారుజామున ఉగ్రవాదులు దాడికి దిగారు. మారణహోమం సృష్టించారు. వారి దాడులలో 35 మంది మృతి చెందారు. వీరిలో అత్యధికులు సైనికులు. కొందరు పౌరులు కూడా బలి అయ్యారని అధికారులు తెలిపారు. రాజధాని నియామేలో ప్రధాన ఎయిర్‌పోర్టు డియోరీ హమానీ అంతర్జాతీయ విమానాశ్రయమంపై ఉన్నట్లుండి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. చాలా గంటల పాటు భీకర స్థాయిలో కాల్పుల మోతలు విన్పించాయి. ఈ దాడికి దిగింది తామే అని అల్‌ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమిన్ ప్రకటించింది.