వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేలా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో ‘జగన్ 2.0’ రూపంలో పార్టీ కార్యకర్తలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తానని, వారిని అందరికంటే మిన్నగా చూసుకుంటానని ఆయన పార్టీ నేతల అంతర్గత సమావేశంలో హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఇకపై నేరుగా కార్యకర్తల చేతుల మీదుగానే ప్రజల్లోకి తీసుకెళ్తామని, తద్వారా క్షేత్రస్థాయిలో వారికి తగిన గుర్తింపు, ప్రజాదరణ దక్కేలా చేస్తానని స్పష్టం చేశారు.