రాయదుర్గం పరిధిలో నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న భూమిని ఒక్కో ఎకరం రూ.237 కోట్ల చొప్పున ఆక్షన్ (వేలం) ద్వారా విక్రయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం తమకు చెందిన భూమిని విక్రయించిందని SBI హైకోర్టును ఆశ్రయించడంతో ఎస్బీఐ (SBI) భూముల వేలంపై హైకోర్టు స్టే విధించింది. అవి SBI భూములని తెలియదా..? ప్రభుత్వ సంస్థ భూములు ఎలా విక్రయిస్తారు..? భూములు వేలం వేస్తూ రియల్ ఎస్టేట్ రంగాన్ని పరుగులు పెట్టించాలి అనుకున్నారా..? కోర్టు న్యాయమూర్తి సర్కార్‌ను ప్రశ్నించినట్టు సమాచారం.