విశాఖలోని గాజువాకలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అత్యంత రద్దీగా ఉండే కణితి రోడ్డులో ఉన్న ‘శివ ఫైర్ వర్క్స్’ దుకాణంలో
కస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చడంతో దుకాణం నుంచి దట్టమైన పొగలు భారీగా ఎగసిపడ్డాయి. లోపల నిల్వ ఉంచిన క్రాకర్స్ భారీ శబ్దాలతో పేలుతుండటంతో చుట్టుపక్కల ప్రజలు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ప్రాణభయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.