సింగపూర్ పర్యటన ముగించుకుని సచివాలయానికి చేరుకున్న వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీస్ ఉన్నతాధికారులను పిలిపించి సమీక్ష నిర్వహించారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి సీఎం చంద్రబాబు సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఈ భేటీలో సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు. సాయికృష్ణ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.